అలర్ట్‌: ఆ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం

16 May, 2020 19:15 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ కమిషనర్ మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి, అడ్డతీగల మారేడుమిల్లి, విశాఖ జిల్లా వై.రామవరం, పెద్దబయలు, మాడుగుల, చింతపల్లి, జీకే వీధి ప్రాంతాల్లో పిడుగు పడే అవకాశముందని పేర్కొన్నారు.  చదవండి: తుప్పు, పప్పు.. 150 మంది సెక్యూరిటీ అవసరమా?

మండలాల వ్యాప్తంగా పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు, కూలీలు, పశువుల, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఒడిశాలోని పారదీప్‌కు దక్షిణంగా 1,060 కిలోమీటర్లు, పశ్చిమ్ బెంగాల్‌లోని డిగాకు నైరుతిగా 1,220 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. కాగా.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపేతమై శనివారం వాయుగుండంగా మారి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇది రేపటికి బలపడి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిసున్నారు. చదవండి: కరోనా కల్లోలం: ఇద్దరు ఏఎస్‌ఐలు మృతి 

మే 17 వరకు ఉత్తర వాయువ్యం దిశగా పయనిస్తూ.. అనంతరం 18,20వ తేదీ నాటికి ఉత్తర ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్‌ వైపు పయనిస్తుందని భావిస్తున్నారు. దీనిప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, యానాం, ఉత్తర కోస్తాలో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. సముద్రంలో గంటకు 45 నుండి 65 కిమి వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు. ఏపీలోని ప్రధాన పోర్ట్‌ల్లో ఒకటవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. చదవండి: కరోనా: ప్రకాశం జిల్లా అరుదైన రికార్డ్

మరిన్ని వార్తలు