తుపాను ధాటికి దెబ్బతిన్న రైల్వే రవాణా

12 Oct, 2014 17:19 IST|Sakshi

విశాఖ: హూదుద్ పెను తుపానుతో రైల్వే రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తుపాను ప్రభావంతో తాజాగా 62 రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. మరో 50 రైల్వే సర్వీసులను దారి మళ్లించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ట్రాక్ స్థితిగతులపై విజయవాడ, విశాఖ, భువనేశ్వర్ నుంచి సమీక్షలు నిర్వహిస్తున్నట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. తుపాను ధాటికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో రైళ్లు భారీగా రద్దయినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి భువనేశ్వర్ మధ్య రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, విశాఖ-హైదరాబాద్ మధ్య రైళ్లను వరుసుగా రెండో రోజు కూడా రద్దు చేశారు.

 

రద్దయిన రైళ్ల వివరాలు..

భువనేశ్వర్ - బెంగళూరు (ప్రశాంతి),
భువనేశ్వర్ - విశాఖపట్నం (ఇంటర్సిటీ)
సికింద్రాబాద్ - భువనేశ్వర్ (విశాఖ)
పూరీ - తిరుపతి ఎక్స్ప్రెస్
భువనేశ్వర్ - ముంబయి (కోణార్క్)
విజయవాడ - విశాఖపట్నం (రత్నాచల్)
తిరుపతి - విశాఖపట్నం (తిరుమల)
నిజాముద్దీన్ - విశాఖపట్నం ( దక్షిణ్)
విశాఖపట్నం - హైదరాబాద్ (గోదావరి)
సికింద్రాబాద్ - విశాఖపట్నం (గరీభ్ రథ్)
విశాఖపట్నం - సికింద్రాబాద్ (దురంతో)
సికింద్రాబాద్ - విశాఖపట్నం (జన్మభూమి)
జగదల్ పూర్ - భువనేశ్వర్ (హిరాకండ్)
విశాఖపట్నం - నిజాముద్దీన్ (సమతా)

మరిన్ని వార్తలు