బంగాళాఖాతంలో అల్పపీడనం

21 Oct, 2013 03:57 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి రెండురోజుల్లో తమిళనాడు వద్ద తీరం దాటే అవకాశం ఉంది. మరోవైపు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఇప్పటికే రుతుపవనాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో వర్షంపడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.  
 ఇటు వర్షాలు.. అటు వేడి: రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. కోస్తాంధ్రలో కొన్నిచోట్ల వర్షాలు పడుతుంటే కొన్నిచోట్ల సూరీడు భగ్గుమంటున్నాడు. రుతుపవనాల ప్రభావం తగ్గడం వల్లే ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్నాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్నిచోట్ల 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా 19 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలున్నాయన్నారు. శుక్ర-శనివారాల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల తిరుగుముఖం ప్రారంభమైందని ఢిల్లీలోని వాతావరణశాఖ పేర్కొంది.

మరిన్ని వార్తలు