తుపాను గండం

27 Oct, 2016 08:10 IST|Sakshi
తుపాను గండం

విశాఖపట్టణం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో క్యాంట్ తుపాను కొనసాగుతోంది. విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 380 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు పేర్కొంది.

మరో 24 గంటల్లో మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు చెప్పింది. అయితే క్యాంట్ తుపాను ప్రభావం వల్ల తీరం వెంబడి 45-55కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్య కారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఏపీలోని అన్ని ఓడరేవుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పింది.

>
మరిన్ని వార్తలు