సమైక్య తీర్మానం పెట్టినా అభ్యంతరం లేదు: డీఎస్

2 Jan, 2014 20:21 IST|Sakshi
సమైక్య తీర్మానం పెట్టినా అభ్యంతరం లేదు: డీఎస్

హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చలు ముగిశాక సమైక్య తీర్మానం పెట్టినా అభ్యంతరం లేదని పీసీసీ మాజీ చీఫ్ డీ. శ్రీనివాస్ చెప్పారు. విభజన ప్రక్రియ ఫిబ్రవరి మధ్యలో పూర్తవుతుందని ఆయన తెలిపారు. అయితే శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును తప్పించడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడం సరియైనదేనని డీఎస్ చెప్పారు. అయితే శాఖను వదులుకోవాలి కానీ, మంత్రి పదవిని కాదని ఆయన హితవు పలికారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టకపోతే పూర్తి కాలం పదవిలో ఉంటారని డీఎస్ తెలిపారు.

కాగా, వేలకోట్ల అవినీతికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాల్పడినట్టు ఆరోపణలున్నాయని డీ. శ్రీనివాస్ విమర్శించారు. అవినీతిపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని డీఎస్ అన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఒకసారి, అటల్ బీహారీ వాజ్పాయ్కి వెన్నుపోటు పొడిచి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన ఆరోపించారు. ఇతర పార్టీల నేతలను కించపరిచే విధంగా చంద్రబాబు మాట్లాడటం బాధాకరమని డీ శ్రీనివాస్ తెలిపారు.

మరిన్ని వార్తలు