ఏడాదిలోనే 90 శాతం హామీలు పూర్తి: రాష్ట్ర కార్యదర్శి

30 May, 2020 15:36 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: దేశంలో మొదటి సంవత్సరంలోనే 90 శాతం హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గ్రామస్థాయిలో సచివాలయాలు పెట్టి సుమారు 20 శాఖల పాలనను అందిస్తున్నారన్నారు. ప్రతి 50 గృహాలకు వాలంటీర్లను నియమించి నేరుగా ప్రజల వద్దకే సంక్షేమ పథకాలను అందిస్తూ సీఎం జగన్‌ ఆదర్శ పాలనను సాగిస్తున్నారన్నారు. (భరోసా కేంద్రాలతో రైతులకు మేలు..)

ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారులకు నేరుగా ఇంటివద్దకే నగదు రూపంలో పించన్‌ అందించడం ఒక ప్రయోగమని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమాలు తలెత్తకుండా 3 రాజ్యాంగ వ్యవస్థలను 3 ప్రాంతాలలో నెలకొల్పి పరిపాలనను వికేంద్రీకరణ చేయడం సీఎం జగన్‌ తీసుకున్న ఆదర్శ ఆలోచన అన్నారు. ప్రతి పార్లమెంటు, నియోజకవర్గ స్థాయిలో ఒక జిల్లాను ఏర్పాటు చేయడంలో భాగంగా 12 కొత్త జిల్లాలను త్వరలో సీఎం జగన్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు