అందుకే ప్ర‌భుత్వంపై కుట్ర‌లు : దాడిశెట్టి రాజా

7 Jul, 2020 13:40 IST|Sakshi

సాక్షి, తాడేప‌ల్లి : ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కుమారుడు లోకేష్‌కు మ‌తి భ్రమించింద‌ని అందుకే ప్ర‌భుత్వంపై కుట్ర‌లు చేస్తున్నారని ప్ర‌భుత్వ విప్ దాడిశెట్టి రాజా మండిప‌డ్డారు.  30 ల‌క్ష‌ల ఇళ్ల స్థ‌లాల‌ను పేద‌ల‌కు ఇస్తుంటే కుట్ర చేస్తున్నార‌న్నారు. మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర ఎన్నో అరాచ‌కాలు చేశార‌ని, మ‌త్స‌కారుల ఇళ్ల‌ను త‌గల‌పెట్టించిన చ‌రిత్ర ఆయ‌న‌ది అని దుయ్య‌బ‌ట్టారు. చంద్ర‌బాబు హయాంలో ఓరిగిందేమీ లేద‌ని  రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ కోస‌మే చంద్ర‌బాబు  తాప‌త్ర‌యం ప‌డ్డారు త‌ప్పా పేద‌ల గురించి ఆలోచించ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా బాబు హ‌యాంలో పేద‌ల‌కు ఒక్క ఇళ్ల నిర్మాణం కూడా జ‌ర‌గ‌లేద‌ని గుర్తుచేశారు. వ్య‌వ‌స్థ‌ల‌ను అడ్డుపెట్టుకొని టీడీపీ నేత‌లు కుట్ర‌లు చేశారు కానీ సీఎం జ‌గ‌న్ పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు మంచి జ‌రుగుతుంది అని రాజా  పేర్కొన్నారు. (దీన్ని బ్లాక్‌ డేగా చెప్పుకోవాలి: వాసిరెడ్డి పద్మ)

టీడీపీ కాపు నేత‌లు కిందిస్థాయిలో ప‌ర్య‌ట‌న జ‌రిపి ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారో తెలుసుకోవాల‌ని రాజా స‌వాల్ విసిరారు. రాష్ట్రంలో ప్ర‌తీ టీడీపీ నేత వైసాస్సార్‌సీపీకి జై కొట్టే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌న్నారు.   కాపుల సంక్షేమం కోసం  ఏడాదికి 400 కోట్లు కూడా ఖ‌ర్చు చేయ‌ని టీడీపీ నేత‌ల‌కు వారి సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హ‌త లేద‌ని దాడిశెట్టి రాజా అన్నారు. రాష్ర్టంలో క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం చేస్తున్న చ‌ర్య‌లను ప్ర‌తీ ఒక్క‌రూ హ‌ర్షిస్తున్నార‌ని కొనియాడారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా క‌ట్ట‌డిలో ముఖ్య‌మంత్రి ప్రపంచానికే ఆద‌ర్శంగా నిలిచార‌ని పేర్కొన్నారు. (సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా: సీఎం జగన్‌ )

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా