రేపటి నుంచే కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు

9 Oct, 2018 16:48 IST|Sakshi

సాక్షి, విజయవాడ : బుధవారం నుంచి కనకదుర్గమ్మ దేవస్థానంలో దసరా ఉత్సవాలు  ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14న మూలానక్షత్రం నాడు సరస్వతీదేవి అవతారంలో కనకదుర్గమ్మను అలంకరించనున్నారు. ప్రతియేటా మూడు లక్షల మంది భక్తులు మూలానక్షత్రం నాడు అమ్మవారిని దర్శించుకుంటారు . ఈ ఉత్సవాల్లో భక్తులు ఇచ్చిన ఆభరణాలతో నిత్యం అమ్మవారికి అలంకారాలు చేయనున్నట్లు తెలిపారు. రూ.8.30 కోట్లతో అమ్మవారి ఉత్సవాలు  జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. 5 వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రత ను కల్పించారు. ఉత్సవాల తొలి రోజు కాణిపాకం వినాయక ఆలయం నుంచి అమ్మ వారికి పట్టువస్త్రాలు  రానున్నాయి. ఈనెల 18తో ఉత్సవాల ముగుస్తాయని దుర్గ గుడి ఈవో వి. కోటేశ్వరమ్మ తెలిపారు. 
 

మరిన్ని వార్తలు