కూతురే కొడుకై..

17 Jul, 2018 13:13 IST|Sakshi
తండ్రి అంతిమయాత్ర ముందు వెళుతున్న మునెమ్మ

తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన కుమార్తె

మనుబోలు: కొడుకులు లేని ఆ తండ్రికి మరణానంతరం కూతురే అన్నీ తానై అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటన సోమవారం మండల కేంద్రం మనుబోలులో చోటుచేసుకుంది. మనుబోలు చంద్రమౌళినగర్‌కు చెందిన సాలాపక్షి శంకరయ్య–రమణమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ముగ్గురికి పెళ్లిళ్లు అయ్యాయి. కొడుకు లేడన్న ఆలోచన లేకుండా చిన్నతనం నుంచి ముగ్గురు కుమార్తెలను శంకరయ్య అల్లారుమద్దుగా పెంచుకున్నాడు. వీరిలో పెద్ద కుమార్తె మునెమ్మకు తండ్రితో ప్రత్యేకమైన అనుబంధం ఉండేది.

చిన్నతనం నుంచి ఇంటికి అన్నీ తానై కొడుకు లేనిలోటు తెలియకుండా తండ్రికి చేదోడువాదోడుగా ఉండేది. ఈమె ప్రస్తుతం మనుబోలు బీసీకాలనీలో అంగన్‌వాడీ ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. కాగా ఆదివారం శంకరయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. ఆచారం ప్రకారం కొడుకులు లేని వారికి అల్లుళ్లు కర్మకాండలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఇందుకు భిన్నంగా మునెమ్మ తండ్రికి అంతిమ సంస్కారాలు, కర్మ క్రతువులు నిర్వహించి అందరిని అబ్బురపరచింది. తన తం డ్రికి తనంటే ఎంతో ఇష్టమని బతికి ఉన్నప్పుడే తన చేతులతోనే కర్మకాండలు చేస్తానని చెప్పానని ఇచ్చిన మాట ప్రకారం అంతమ సంస్కారాలు నిర్వహించానని మునెమ్మ తెలిపింది.

>
మరిన్ని వార్తలు