పట్టపగలు దోపిడీ!

19 Aug, 2015 03:40 IST|Sakshi
పట్టపగలు దోపిడీ!

♦ గుమస్తాపై దాడి
♦ రూ. 10 లక్షల అపహరణ
♦ దుండగులతో చేతులు కలిపిన గని కార్మికుడు
 
 బేతంచెర్ల : బేతంచెర్ల- బనగానపల్లె రహదారిలో మంగళవారం పట్టపగలు దోపిడీ జరిగింది. దుండగులు పక్కా పథకం ప్రకారం దాడి చేసి రూ. 10 లక్షలు అపహరించారు. గోర్లగుట్ట గ్రా మ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. పలుకూరు గ్రామానికి చెందిన నాపరాళ్ల గని యజమాని దస్తగిరిరెడ్డి దగ్గర అదే గ్రామానికి చెందిన నాగరాజు గుమస్తాగా పనిచేస్తున్నాడు. పలుకూ రు గ్రామం నుంచి నాపరాళ్లను బేతంచెర్లకు తీసుకువచ్చి అక్కడ విక్రయాలు జరుపుతుంటారు. అందుకు సంబంధించిన నగదు వసూలు కోసం నాగరాజుతో పాటు అదే గనిలో పని చేస్తు న్న కార్మికుడి శ్రీనివాసులు మంగళవా రం ఉదయం ద్విచక్రవాహనంపై బేతంచెర్లకు వచ్చారు.

దాదాపు రూ. 10 లక్షలు వసూలు చేసుకుని పలుకూరుకు తిరుగు ప్రయాణమన్నారు. గోర్లగుట్ట గ్రామ ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో ఎదురుగా మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి అటకాయించారు. అ సమయంలో గని కార్మికుడు శ్రీనివాసులు కూడా గుర్తు తెలియని వ్యక్తులతో కలిసిపోయి నాగరాజు తలపై దాడి చేసి, వీపు భాగాన కత్తిపొడిచి అతని దగ్గర ఉన్న రూ.10 లక్షలను ఎత్తుకెళ్లారు. అపస్మారక స్థితిలో పడిపోయిన గుమస్తాను వాహనదారులు బేతంచెర్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 108లో కర్నూలుకు తరలించారు. గని యజమాని దస్తగిరిరెడ్డి, గుమస్తా నాగరాజు ఫిర్యాదు మేరకు బేతంచెర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.    

 సమాచారం అందుకున్న డోన్ డీ ఎస్పీ పీఎన్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తు లు దాడి చేసిన తీరుపై  ఆరా తీశారు. ఆయన వెంట బేతంచెర్ల ఎస్‌ఐ హనుమంత్‌రెడ్డి పోలీస్ సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు