డెడ్‌లైన్ 31

7 Jan, 2014 01:59 IST|Sakshi
డెడ్‌లైన్ 31

సాక్షి, బెంగళూరు :  నిబంధలనకు విరుద్ధంగా రైతుల నుంచి భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుపుతున్న నైస్ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని మా ప్రధాని, జేడీఎస్ పార్టీ జాతీయఅధ్యక్షుడు దేవెగౌడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నైస్ కంపెనీ వ్యవస్థాపకుడు అశోక్‌ఖైనీ ప్రతి విషయానికి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని పనులు కానిచ్చేస్తున్నాడన్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుని నైస్ కంపెనీ చేపట్టిన ‘బెంగళూరు-మైసూరు ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ కారిడార్’ (బీఎంఐసీ)ను రద్దు చేసి ఇతర సంస్థలకు అప్పగించాలన్నారు. లేదా ప్రభుత్వమే ఈ పథకాన్ని చేపట్టాలన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘బీఎంసీ’ ప్రాజెక్టును తామే చేపడుతామని ముందుకు వచ్చాయన్నారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పాయన్నారు.

అంతేకాకుండా టోల్ కూడా సేకరించబోమని చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే అప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీ ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదన్నారు. అందువల్లే ప్రస్తుతం ‘బీఎంఐసీ’ కోసమని రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకోవలసిన పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెంటనే కలుగజేసుకుని రైతులకు న్యాయం చేయాలని దేవెగౌడ పేర్కొన్నారు.
 
 6- అప్పిచ్చిన వ్యక్తిపై తుపాకీతో కాల్పులు
 
 గంగావతి, న్యూస్‌లైన్ : అప్పు ఇచ్చిన సొమ్మును తిరిగి చెల్లించాలని అడిగిన వ్యక్తిని రుణం పొందిన వ్యక్తి మరొకరి సాహయంతో నాటు తుపాకితో కాల్పులు జరిపిన సంఘటన గంగావతి తాలూకా తాలూకాలోని మొలకనమరళి గ్రామం వద్ద సోమవారం జరిగింది. వివరాలు.. గంగావతి తాలూకాలోని వడ్రహట్టి గ్రామానికి చెందిన చెన్ననగౌడ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన బసవరాజ్ వడ్రహట్టికి రూ.4.50 లక్షలు అప్పు ఇచ్చాడు.

దీంతో చెన్నన గౌడకు బసవరాజ్ ఫోన్ చేసి నీ అప్పు చెల్లిస్తానని మొలకనమరళి గ్రామం వద్దకు రమ్మని చెప్పాడు. దీంతో చెన్ననగౌడ కారులో ఆ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడికి రాగానే చెన్ననగౌడను బసవరాజ్ వడ్రహట్టి, అతని స్నేహితుడు నరసప్ప నాటు తుపాకితో కాల్చారు. దీంతో తుపాకి గుండు తలలో దూసుకుపోవడంతో చెన్ననగౌడ నేల కూలుతూ రక్షించండి..

రక్షించండి అంటూ కేకలు వేయడంతో గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని బసవరాజ్‌ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఆయనకు తోడుగా వచ్చిన నరసప్ప, పరారై అనంతరం పోలీసులకు లొంగి పోయాడు. కాల్పులకు ఉపయోగించిన నాటు తుపాకిని, బసవరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షతగా త్రుడికి గంగావతి ఆస్పత్రిలో చికి త్స  అనంతరం బళ్లారి విమ్స్‌కు తరలిం చారు.
 
ఘటనా స్థలాన్ని ఎస్పీ పరిశీలన : ఘటనా స్థలాన్ని కొప్పళ జిల్లా ఎస్పీ మంజునాథ్ అన్నిగి పరిశీలించారు. అనంతరం ఆయన గంగావతి పోలీస్ స్టేషన్‌లో మాట్లాడుతూ ఈ ఘటన ఎలా జరిగిందనే విషయంపై  సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు వెలికి తీస్తామన్నారు. ఈ సందర్భంగా గంగావతి డీవైఎస్పీ శాంతకుమార్, సీపీ ప్రభాకర్ ధర్మట్టి, టౌన్ సీఐ కాళీకృష్ణ, తదితరులు ఉన్నారు. గంగావతి రూరల్ పోలీస్ కేసు దర్యాప్తు చేపట్టారు. గంగావతి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా తీవ్ర ప్రమాదస్థితిలో ఉందన్న వైద్యులు ఆయన విమ్స్‌కు తరలించారు.

 

మరిన్ని వార్తలు