శుభలేఖలు ఇచ్చేందుకు వెళుతూ..

12 Jun, 2014 02:25 IST|Sakshi
శుభలేఖలు ఇచ్చేందుకు వెళుతూ..

పెద్దమండ్యం: చెల్లెలు వివాహానికి శుభలేఖలు ఇచ్చేందుకు బయలుదేరిన ఓ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ సంఘటన  బుధవారం పెద్దమండ్యం-గాలివీడు రహదారిపై జరిగింది. పోలీసుల కథనం మేరకు .. వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలం పందికుంట తాండాకు చెందిన కృష్ణానాయక్‌కు కుమారుడు రమేశ్‌నాయక్ (27), కూతురు కవిత ఉన్నారు. కవిత కు అదే తాండాకు చెందిన రాజానాయక్‌తో శనివారం వివాహం జరుగనుంది. దీనికి సంబంధించి బంధువులకు శుభలేఖలు ఇచ్చేందుకు కలిచెర్లకు ద్విచక్రవాహనంలో రమేశ్‌నాయక్ బయలుదేరా డు. పెద్దమండ్యం-గాలివీడు రహదారిపై నమాజుకట్ట మలుపు వద్ద ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న స్కూల్‌వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయింది.

వాహనా న్ని నడుపుతున్న రమేశ్‌నాయక్ తీవ్రం గా గాయపడ్డారు. అటుగా వస్తున్న వారు తీవ్రంగా గాయపడిన రమేశ్‌నాయక్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే తీవ్రగాయాలు కావడంతో రమేశ్‌నాయక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెనుక కూర్చొని ఉన్న పెద్దమండ్యం మండలం కలిచెర్లకు చెందిన అబ్దుల్ (12)కు స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన అబ్దుల్‌ను చికిత్స నిమిత్తం స్థానికులు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. ప్రమాద స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మనోహర్ తెలిపారు.

రోదించిన కుటుంబసభ్యులు

చెల్లెలు వివాహానికి శుభలేఖలు ఇ చ్చేందుకు వెళుతూ రమేష్‌నాయక్  మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఒక్కగానొక్క కొడుకైన రమేశ్ మృతితో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
 
 
 
 

మరిన్ని వార్తలు