డిసెంబర్ 20 నుంచి ఎస్సారెస్పీ నీరు విడుదల

30 Nov, 2013 02:37 IST|Sakshi

వరంగల్, న్యూస్‌లైన్ : రబీకి ఎస్సారెస్పీ నీటి విడుదల ఖరారైంది. ఎస్సారెస్పీ స్టేజ్-1లోని 3.37 లక్షల ఎకరాల ఆయకట్టు వరకు నీటిని అందించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. రెండో దశలో కాల్వల పరిస్థితి అధ్వానంగా ఉండడం, కొన్ని చోట్ల మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో స్టేజ్-2కు ఈసారి నీరు విడుదల చేసేందుకు సంశయిస్తున్నారు. డిసెంబర్ 20 నుంచి ఎస్సారెస్పీ కాకతీయ కాల్వ నుంచి నీటిని విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఏడు విడతల్లో ఏడు తడులు నీరివ్వనున్నారు.

నీటి పారుదల శాఖ నుంచి కూడా ఆ మోదం లభించినట్లు అధికారులు చెబుతున్నారు. మార్చి 31 వరకు నీటిని ఇవ్వనున్నారు. ఈసారి కూడా ఆన్ ఆఫ్ పద్ధతిలోనే నీరందింస్తామని, 9 రోజులు ఆన్... 6 రోజులు ఆఫ్ ఉంటుందని ప్రాజెక్టు ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి చె ప్పారు. ఇప్పటికే ఉప కాల్వల వద్ద చిన్నచిన్న మరమ్మతులు, ప్రధాన కాల్వలో మట్టి తొలగిం చడం, చెట్లు తీసేయడం వంటి పనులు అధికారులు చేపట్టారు.

డిసెంబర్ 15 వరకు కాల్వలను సిద్ధం చేసి, 20 నుంచి నీటిని ఇవ్వనున్నా రు. అయితే ఖరీఫ్ సీజన్‌లోనే కావాల్సినంత నీటిని విడుదల చేయడంతో కొన్ని ప్రాంతాల్లో చెరువులను పూర్తిస్థాయిలో నింపారు. రబీ సీజ న్‌కు మాత్రం విడుదల చేస్తున్న నీటిని కేవలం పంటల సాగుకే వినియోగించుకోవాలని, రెం డో పంట వేసే రైతులు కొంత మేరకు ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచిం చారు. పూ ర్తి ఆయకట్టులో వరిసాగు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.
 

మరిన్ని వార్తలు