భీమిలి తీరంలో జింక చక్కర్లు

6 Apr, 2020 13:16 IST|Sakshi
భీమిలి తీరప్రాంతంలో ఎగురుతున్న జింక

తగరపువలస (భీమిలి): భీమిలి సముద్ర తీరంలో ఓ జింక చక్కర్లు కొడుతోంది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి. కంబాలకొండ అటవీ ప్రాంతం నుంచి తరచూ జింకలు తాగునీటి కోసం జాతీయ రహదారిపైకి వచ్చేస్తూ వాహనదారుల కంటికి కనిపిస్తుంటాయి. మనుషుల అలికిడి తగిలితే మళ్లీ లోపలికి వెళ్లిపోతుంటాయి. రెండు రోజులుగా ఓ జింక భీమిలి తీరానికి వచ్చేసి ఇక్కడ సముద్రంలోకి వెళ్లడానికి ప్రయత్నించి అలలు రావడంతో వెనక్కు తగ్గుతోందని స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు