డిగ్రీ ప్రశ్నాపత్రం లీక్‌

1 Nov, 2017 13:36 IST|Sakshi
విద్యార్థి నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకుంటున్న అబ్జర్వర్‌ ,లభ్యమైన ప్రశ్నాపత్రానికి సంబంధించిన జవాబులు

జవాబులు చేతిలో రాసుకుని పట్టుబడిన విద్యార్థులు

కోవెలకుంట్ల: కోవెలకుంట్లలో మంగళవారం డిగ్రీ పరీక్షల ప్రశ్నాపత్రం లీకైంది. అక్టోబర్‌ 24వ తేదీ నుంచి  డి గ్రీ   మూడవ సెమిస్టర్‌ పరీక్షలు మొదలయ్యాయి. పట్టణంలో మూడు కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌అండ్‌ సాఫ్ట్‌స్కిల్స్‌ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించి ప్రశ్నా పత్రం ముందుగానే లీకైంది. దీంతో కొందరు విద్యార్థులు  జవాబులను చేతిలో రాసుకుని స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రానికి హాజరయ్యారు.

అబ్జర్వర్‌ నాగేంద్ర గమనించి పరీక్ష రాస్తున్న ఇద్దరు విద్యార్థులను డీబార్‌ చేశారు.  పరీక్ష కేంద్ర పరిసరాల్లో ప్రశ్నలకు సంబంధించిన జవాబుల పత్రం సైతం లభ్యమైంది. దీంతో సీఎస్‌ఎస్‌ పేపర్‌ లీకైనట్లు భావించి రాయలసీమ యూనివర్సిటీ అధికారులకు  సమాచారం అందించారు. పట్టుబడిన విద్యార్థుల నుంచి రాతపూర్వక స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. ఈ సందర్భంగా అబ్జర్వర్‌ మాట్లాడుతూ విద్యార్థుల చేతిలో సీఎస్‌ఎస్‌ పరీక్షకు సంబంధించి జవాబులు ఉండటంతో ఆ విద్యార్థుల నుంచి సేకరించిన ఆధారాలను యూనివర్సిటీ అధికారులకు చేరవేశామన్నారు.   ప్రశ్నాపత్రం ఎక్కడ లీకైందన్న విషయం విచారణలో తేలాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు