పాపం నవ వధువు.. పెళ్లైన నెలలోపే..

18 Nov, 2019 11:36 IST|Sakshi
గీత (ఫైల్‌)

సాక్షి, గంగవరం: పెళ్లయిన నెలలోపే నవ వధువును డెంగీ మహమ్మారి కబళించింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కూర్నిపల్లిలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. హరీష్‌కు కర్ణాటకలోని కోగిలేరుకు చెందిన గీత(21)తో గత నెల 24న వివాహమైంది. వధూవరులు ఈ నెల 5న కూర్నిపల్లికి వచ్చారు. గీతకు జ్వరం రావడంతో పలమనేరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందింది. కోలుకోవడంతో మూడో మెరివలికి వధువు స్వగ్రామానికి వెళ్లారు. మళ్లీ జ్వరం రావడంతో బెంగళూరు మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి డెంగీగా నిర్ధారించారు. ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోవడంతో గత శనివారం ఆస్పత్రిలో మృతిచెందింది. (చదవండి: ఇన్ఫోసిస్‌లో జాబొచ్చింది కానీ అంతలోనే..)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా