ఆరోగ్యబీమా మాటున దర్జాగా దగా

9 Nov, 2014 00:23 IST|Sakshi
ఆరోగ్యబీమా మాటున దర్జాగా దగా

 కంబాల చెరువు (రాజమండ్రి) : అనుకోకుండా జబ్బు చేస్తే.. అదే సమయంలో జేబులు ఖాళీగా ఉంటే ఎదురయ్యే దురవస్థకు విరుగుడుగా ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) చేయించుకుంటారు. బీమా చేయించుకున్నాం కదా.. ఒకవేళ రాకూడని నలత వచ్చినా, చికిత్సకు డబ్బుల కోసం తంటాలు పడనక్కరలేదనుకుంటారు. అయితే ‘స్టార్ హెల్త్’ ఇన్సూరెన్స్ రాజమండ్రి శాఖ (దానవాయిపేట)లో జూనియర్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఆనందరాజు పలు వురికి ఆ ధీమాను కరువు చేశా డు. అనేకుల వద రూ.10 వేల ప్రీమియం చొప్పున కట్టించుకుని, నకిలీ పాలసీపత్రాలను ఇచ్చాడు. ఈ వైనం బయటకు రావడంతో ఆనందరాజు పరారవగా ‘స్టార్ హెల్త్’ ఉన్నతాధికారులు శనివారం రాజమండ్రి శాఖలో తనిఖీలు జరిపారు.
 
 ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వ్యవహారంపై ‘సాక్షి’ కొందరు పాలసీదారులతో ఫోన్‌లో మాట్లాడింది. స్థానికంగానూ, ఇతర ప్రాంతాల్లోనూ ఆనందరాజు, మరికొందరి వల్ల మోసపోయిన వారు చాలామందే ఉన్నట్టు సమాచారం. గతంలో సొమ్ము కట్టించుకుని నకి లీ పాలసీ ఇచ్చారని, తాను గుర్తించి, గొడవ పెట్టుకుంటే అసలు పాలసీ ఇచ్చారని నగరానికి చెందిన సిమ్ కార్డుల వ్యాపారి తెలిపాడు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఒక ప్రముఖ సంస్థ 200 మంది ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించగా, అందులోనూ కొన్ని నకిలీ పాలసీలున్నట్టు తెలుస్తోంది. పశ్చిమలోని తణుకు, ఇతర ప్రాంతాల్లోనూ బాధితులున్నట్టు తెలుస్తోంది. ఆనందరాజు గోల్‌మాల్ వ్యవహారం బయట పడిన నేపథ్యంలో పాలసీదారులు కార్యాలయానికి వచ్చి వారి పాలసీలను తనిఖీ చేసుకుంటే నకిలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు