అగ్రిగోల్డ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

4 May, 2015 14:25 IST|Sakshi

విజయవాడ : విజయవాడలోని అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అగ్రీగోల్డ్ ఏజెంట్లు,  డిపాజిట్దారులు ఆందోళనకు దిగారు. కార్యాలయంలోని చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. దాంతో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కష్టపడి సంపాదించిన సొమ్ముకు అధిక వడ్డీ ఇస్తామని అగ్రీగోల్డ్ మోసం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు గడువు ముగిసినా డిపాజిట్లు చెల్లించకపోవటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి.  అంతకు ముందు డిపాజిట్దారులు, ఏజెంట్లు తమకు న్యాయం చేయాలంటూ విజయవాడ్ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కాగా ఈ వ్యవహారాన్ని తానే స్వయంగా పర్యవేక్షించి బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు