వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

11 Jul, 2013 10:40 IST|Sakshi

విశాఖ : నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసిన వేళ... వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిషా నుంచి  తమిళనాడు వరకు అల్పపీడన ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి కొసాగుతోంది. అల్పపీడన ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తా, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని ప్రకటించింది.

కాగా బంగాళాఖాతంలో కోస్తా తీరం వెంబడి ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. జూన్‌ ప్రారంభంలో వర్షాలు సంవృద్ధిగా కురిసినప్పటికీ ఆ తర్వాత కనుమరుగయ్యాయి. ఈ సమయంలో కోస్తా తీరం వెంబడి ఏర్పడిన ద్రోణితో వాతావరణం మళ్లీ చల్లబడింది.

దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ద్రోణి ప్రభావంతో వర్షాలు సంవృద్ధిగా కురిస్తే.. పూర్తిస్థాయిలో వ్యవసాయ పనులు ప్రారంభం కావచ్చునన్న ఆశతో రైతులు ఉన్నారు. జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి, పెద్దాపురం డివిజన్లలో వర్షాలు కురుస్తున్నాయి.

గత 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. చింతపల్లి-136, జి.మాడుగుల-129, వై.రామవరం-85, పెదబయలు-72, మెదక్-62, తూప్రాన్-61 మి.మీ.

మరిన్ని వార్తలు