దివాకర్‌ ట్రావెల్స్‌ అక్రమాలపై లోతుగా విచారణ

20 Jul, 2020 16:01 IST|Sakshi

సాక్షి, అనంతపురం: దివాకర్‌ ట్రావెల్స్‌ అక్రమాలపై లోతుగా విచారణ చేస్తున్నట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ శివరాంప్రసాద్‌ తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 154 వాహనాలను అక్రమ రిజిస్ట్రేషన్‌ చేశారు. అందుకు సంబంధించిన 62 బస్సులు, లారీలను అనంతపురం జిల్లాలో ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాం. మిగిలిన వాహనాలను ఎక్కడ దాచారన్న సమాచారంపై విచారణ కొనసాగిస్తున్నాం. నకిలీ ఇన్‌వాయిస్‌, ఫేక్‌ ఇన్సూరెన్స్‌లపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. (కర్నూల్‌ పీఎస్‌లో ముగిసిన జేసీ విచారణ)

కరోనా కట్టడికి చర్యలు
రవాణాశాఖలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నాము. అందులో భాగంగానే బయోమెట్రిక్‌ విధానాన్ని రద్దు చేశాము. ఎక్కువ మంది బయోమెట్రిక్ తాకటం వల్ల కరోనా సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఓటీపీ ద్వారా రవాణాశాఖ సేవలు పొందవచ్చు. అందుకోసమే ఓటీపీ విధానాన్ని అమల్లోకి తెచ్చిన ఆర్టీఏ అధికారులు డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్లు,పర్మిట్లు జారీ వంటి 18 రకాల సేవలను ఓటీపీ ద్వారా అందించున్నట్లు శివరాంప్రసాద్ తెలిపారు. (నేరం అంగీకరించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి!)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు