మీ బిడ్డలకోసమైనా.. తీరు మార్చుకోండి

22 May, 2020 12:47 IST|Sakshi
ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

చిత్తూరు, గుడిపాల: ‘‘దశాబ్దాల నుంచి రాసనపల్లె అంటేనే సారా తయారీకి పేరు గాంచింది. బిడ్డల అభివృద్ధి కోసమైనా మీ తీరును మార్చు కోవాల్సిన అవసరం  ఉంది.’’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. మండలంలోని రాసనపల్లె దళితవాడలో గురువారం సారా నిర్మూలన కోసం  గ్రామస్తులకు ఎక్సైజ్, పోలీస్‌శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అవ గాహన సదస్సు నిర్వహించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి రిశాంత్‌రెడ్డి పర్యవేక్షించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న నారాయణస్వామి మాట్లాడుతూ విడతలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలుచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంకల్పించారని తెలిపారు. గ్రామంలో అందరూ కలిసికట్టుగా సారా తయారీ ఆపేస్తామని ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ రాసనపల్లె గత కొన్నేళ్లుగా సారా తయారీలో మునిగిపోయి అభివృద్ధికి దూరమైందన్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ సీఎం ఆదేశాలతో రాష్ట్రంలోని బెల్ట్‌షాపులన్నీ తొల గించారన్నారు. స్థానిక ఎక్సైజ్‌ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు