‘విద్యార్థుల ప్రగతే టీచర్లకు అవార్డులు’

5 Sep, 2019 14:11 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఉత్తమ ఉపాధ్యాయులను గురువారం ఏపీ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి సన్మానించారు. ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ లెక్చరర్ల సుదీర్ఘ సమస్యను పరిష్కరించి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించిన సందర్బంగా మంత్రి శ్రీవాణిని జూనియర్ కళాశాలల అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి గిరిజన విద్యా సంస్థల్లో వర్చువల్ క్లాస్ రూములను, కేంద్రీకృత సీసీ కెమెరాల వ్యవస్థను ప్రారంభించారు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా 105 గిరిజన విద్యాసంస్థల్లో వర్చువల్  క్లాస్ రూములు ప్రారంభమైయ్యాయి. విద్యకు, ఉపాధ్యాయులకు జగన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. తొమ్మిది ప్రమాణాలకు అనుగుణంగా గిరిజన విద్యాసంస్థల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పిల్లలు సాధించిన ప్రగతినే టీచర్లు తమ అవార్డులుగా భావించాలని, మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.
 

మరిన్ని వార్తలు