వైద్య రంగానికి సీఎం జగన్‌ పెద్దపీట

3 Jan, 2020 12:06 IST|Sakshi

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

సాక్షి, ఏలూరు: ఆరోగ్యశ్రీని చంద్రబాబు నిర్వీర్యం చేశారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆరోగ్యశ్రీ పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో పేదలకు వైద్యసేవలు అందక చనిపోయే పరిస్థితి ఉండేందని.. ఆరోగ్యశ్రీ నిధులను దారి మళ్లించారని దుయ్యబట్టారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే వైద్య రంగానికి పెద్దపీట వేశారని తెలిపారు. పేదలకు సరైన సమయంలో వైద్యం అందించాలనే ఆలోచన చేశారని పేర్కొన్నారు. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్య పథకం వర్తింప చేశారన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి అదనంగా మరో వెయ్యి వ్యాధులను చేర్చామని తెలిపారు. ఆపరేషన్‌ చేయించుకున్నాక విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 ఇస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 2,059 వ్యాధులకు వైద్యం అందిస్తామని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు