జగన్‌తోనే మైనారిటీల అభివృద్ధి

9 Sep, 2019 09:33 IST|Sakshi
మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా 

ఏపీ చరిత్రలో మొదటిసారిగా మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ వెల్ఫేర్‌ శాఖ మంత్రి అంజాద్‌ బాషా అన్నారు.  విశాఖలో మైనారిటీ సెల్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముస్లింల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనారిటీల సంక్షేమానికి అధిక నిధులు కేటయించా మని చెప్పారు.  జిల్లాలో  వక్ఫ్‌బోర్డు ఆస్తులు, మసీద్, దర్గాల సమస్యలను  త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  టీడీపీ ఐదేళ్ల పాలనలో ముస్లింలను  ఇబ్బందులకు గురిచేశారని, ప్రశ్నించిన వారిపై అక్రమకేసులు పెట్టి వేధించారని   గుర్తుచేశారు. రాబోయే విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దతునిచ్చి గెలిపించాలని కోరారు. ముస్లింలకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
 – సాక్షి, విశాఖపట్నం

సాక్షి, విశాఖపట్నం : మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్‌ బాషా చెప్పారు.  వుడాచిల్డ్రన్‌ థియేటర్‌లో ఆదివారం వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐహెచ్‌ పరూఖీ ఆధ్వర్యంలో ఆత్మీయ సభ నిర్వహించారు. అంతక ముందు మైనారిటీల సమస్యలపై ఆయన వినతులు స్వీకరించారు. అనంతరం మంత్రి అంజాద్‌బాషా మాట్లాడుతూ జిల్లాలో  వక్ఫ్‌బోర్డుల ఆస్తులపై ఉన్న వివాదాలతో పాటు మసీదులు, దర్గాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌తో జరిగిన సమావేశంలో మైనారిటీ సబ్‌ ప్లాన్‌పై చర్చించినట్టు చెప్పారు. అలాగే హజ్‌ యాత్రకు సీఎం ప్రత్యేకంగా నిధులు కేటా యించారని వివరించారు. నాడు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపారని .. ఇప్పుడు ఆయన తనయుడు, సీఎం వైఎస్‌ జగన్‌ రెట్టి పథకాలు అమలు చేస్తూ మైనారిటీలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు.

హామీల అమలు దిశగా కార్యాచరణ
ప్రజాసంకల్పయాత్రలో ముస్లింలకు ఇచ్చిన హామీ అమలు చేసేవిధంగా సీఎం జగనన్న చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ముస్లింల కు ఏ సమస్యలొచ్చినా పరిష్కారానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. అదే సందర్భంలో త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి మైనారిటీలంతా శక్తి వంచన లేకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నా«థ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థికంగా వెనకబడిన మైనారి టీలు ఉత్తరాంధ్రలోనే ఉన్నారని, వారి అభివృద్ధికి తోడ్పడాలని ఉపముఖ్యమంత్రిని కోరారు.  ఎక్కువ శాతం నిధులు ఉత్తరాంధ్రలో వెచ్చించా లని కోరారు.  వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ మాట్లాడుతూ విశాఖ సిటీ స్టేక్‌హోల్డర్స్‌ ముస్లింలని.. వారి అభివృద్ధికి సీఎం జగన్‌ ముందుంటారని చెప్పారు. విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేయాలని ఆలోచనలో సీఎం ఉన్నారని పేర్కొన్నారు. 

మంత్రి అంజాద్‌ బాషాను సన్మానిస్తున్న పార్టీ నాయకులు, ముస్లిం నేతలు

ముస్లింలను వంచించిన టీడీపీని నమ్మవద్దని
నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీనివాస్‌ మాట్లాడు తూ వెనకబడిన ఉత్తరాంధ్రలో ముస్లింలకు అత్యధికంగా నిధులు వెచ్చించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు మా ట్లాడుతూ ముస్లింలకు ఐదు సీట్లు ఇస్తే నాలుగు గెలిచారని, ఓడిపోయిన ఆ ఒక్కరికీ ఎంఎల్‌సీ ఇచ్చారంటే ఆ వర్గంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. సమన్వయకర్త కేకేరాజు, అధికార ప్రతినిధి ప్రసాదరెడ్డి, ఎంఏ ఖాన్,  పార్టీ మైనా రిటీ విభాగం విశాఖ పార్లమెంట్, నగర అధ్యక్షుడులు బర్కత్‌ అలీ, షరీఫ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సనపల చంద్రమౌళి, పార్లమెం ట్‌ జిల్లా మహిళా అధ్యక్షరాలు పీలా వెంకటలక్ష్మి,  ముఖ్యనేతలు బాబా, అజంఅలీ, షేక్‌బాబ్జి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు