టీడీపీ పాలనలో మద్యం ఏరులై పారింది..

16 Dec, 2019 10:58 IST|Sakshi

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

సాక్షి, అమరావతి: మద్య పానంపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో మద్యం ఏరులై పారిందని ధ్వజమెత్తారు. మద్యం సరఫరా చేయాలన్నదే టీడీపీ ఉద్దేశమా అని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం అమలు చేయాలా? వద్దా అనేది టీడీపీ చెప్పాలన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని దశవారీగా అమలు చేస్తోందన్నారు. టీడీపీ హయాంలో మద్యం లైసెన్స్‌లన్నీ వారి మద్దతుదారులకే ఇచ్చారన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పూర్తి మద్యపాన నిషేధానికి శ్రీకారం చుట్టారన్నారు. మద్యపాన నిషేధంపై ప్రజలను టీడీపీ తప్పుదారి పట్టిస్తోందని ధ్వజమెత్తారు. ఎక్కడా మహిళలు ధర్నా చేయడం లేదని.. మా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారన్నారని చెప్పారు. మద్యం షాపుల టెండర్లపై కూడా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్ళాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన కోరారు.
 

మరిన్ని వార్తలు