‘ప్రజల కోసం కూలీగా పనిచేస్తా’

4 Jun, 2020 08:46 IST|Sakshi

సాక్షి, వెదురుకుప్పం: ‘రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కాదు.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ప్రజలకు సేవలందించే కూలీగా పనిచేస్తాను’ అని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. బుధవారం మండలంలోని పచ్చికాపల్లం సమీపంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కేటాయించిన స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. అంతకు ముందు తిరుమలరాజపురం గ్రామంలో తాగునీటి బోరును ప్రారంభించి కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేశా రు. అనంతరం వివిధ∙శాఖాధికారులతో సమస్యలపై సమీక్షించారు. (ఎంపీ రంగయ్యకు ప్రధాని మోదీ లేఖ )

రూ.15 కోట్లతో డిగ్రీ కళాశాల అభివృద్ధి..
కొత్తగా మంజూరైన వైఎస్సార్‌ డిగ్రీ కళాశాల అభివృద్ధికి సంబంధించి రూ.15 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇది జిల్లాలోనే మోడల్‌ డిగ్రీ కళాశాలగా రూపుదిద్దుకోనుందన్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మండలానికి డిగ్రీ కళాశాల కావాలని తాను అడిగినట్లు తెలిపారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అనుమతిచ్చినట్లు తెలిపారు. డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సంబంధించిన భూమిని అనుభవిస్తున్న రైతులకు న్యాయం చేయాలన్నారు. స్వచ్ఛందంగా ముందుకొచి్చన వారికి ప్రభుత్వ భూమి, ఇంటి స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని తహసీల్దార్‌ కులశేఖర్‌ను ఆదేశించారు. (వాషింగ్టన్‌లో మహాత్మ గాంధీ విగ్రహం ధ్వంసం)


డిగ్రీ కళాశాలకు కేటాయించిన స్థలాన్ని పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి 

సాగునీటి కొరత నివారణకు చర్యలు
గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో సాగునీటి కొరత నివారణ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కార్వేటినగరం మండలంలోని కృష్ణాపురం రిజర్వాయర్‌ పరిధిని పెంచి తద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. వావిల్‌ చేను సమీపంలో ప్రాజెక్టు నిర్మించి రైతులకు నీళ్లందిస్తామన్నారు. నీటి సమస్య నివారణకు రూ. 225 కోట్లతో ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. డిగ్రీ కళాశాల ప్రత్యేకాధికారి ఎస్‌. విజయలు రెడ్డి, హౌసింగ్‌ పీడీ నగేష్, డ్వామా పీడీ చంద్రశేఖర్, ఎంపీడీఓ సుధాకరరావు, సీఐ సురేంద్రరెడ్డి, జె డ్పీటీసీ సి.సుకుమార్, కళాశాల అభివృద్ధి కమి టీ చైర్మన్‌ బండి గోవర్ధన్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి ఢిల్లీ ప్రసాద్,నాయకులు బి.సుబ్రమణ్యం, పేట ధనుంజయరెడ్డి కే. పద్మనాభరెడ్డి పాల్గొన్నారు. (ఢిల్లీలో మ‌రోసారి భూప్రకంపనలు )

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు