సీఎం జగన్‌ మరో రికార్డు సాధిస్తారు

18 Oct, 2019 12:33 IST|Sakshi

డిప్యూటీ సీఎం సుభాష్‌ చంద్రబోస్‌

సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉగాది నాటికి ఇళ్ల పట్టాలిచ్చేందుకు లబ్ధిదారులను గుర్తిస్తున్నామని.. ఇప్పటివరకు 13 జిల్లాల్లో 20.50 లక్షల లబ్ధిదారులను గుర్తించామని వెల్లడించారు. ఇంకా గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని.. గ్రామాల్లో 8.5 లక్షలు, పట్టణాల్లో 7 లక్షల లబ్ధిదారులను గుర్తించామని తెలిపారు. సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులను 5 లక్షల మందికి పైగా గుర్తించామని పేర్కొన్నారు.

ఇళ్ల స్థలాల కోసం రూరల్‌ ప్రాంతాల్లో 19 వేలు, పట్టణాల్లో 2,500 వేల ఎకరాలను గుర్తించామని..ఇంకా 19వేల ఎకరాలు భూమి అవసరం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. దాదాపు 10వేల ఎకరాల్లో భూమిని సమీకరిస్తున్నామని వెల్లడించారు. ఒకేసారి లక్షల సంఖ్యలో పట్టాలివ్వడం దేశంలోనే ప్రథమం అవుతుందని.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కచ్చితంగా రికార్డు సాధిస్తారని సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు