గిరిజనుల అభివృద్ధికి రూ.4,988 కోట్లు

21 Oct, 2019 19:15 IST|Sakshi

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

సాక్షి, అమరావతి: గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సబ్‌ప్లాన్‌ నిధుల అవినీతిపై నోడల్‌ ఏజెన్సీతో విచారణ జరిపిస్తామని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో గిరిజన సబ్‌ప్లాన్‌ నిధులను దారిమళ్లించి.. దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పారదర్శక పాలన జరుగుతుందన్నారు. సబ్‌ప్లాన్‌ నిధులు దుర్వినియోగం కాకుండా ప్రతి పైసా గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గిరిజనుల అభివృద్ధికి రూ.4,988 కోట్లతో ఉప ప్రణాళికను అమలు చేస్తున్నామని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు