గిరిజన శాఖమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పుష్పశ్రీవాణి

20 Jun, 2019 14:11 IST|Sakshi

సాక్షి, అమరావతి : గిరిజన శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ....గిరిజన గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తల వేతనాలను రూ.400 నుంచి రూ.4వేలకు పెంచుతూ తొలి సంతకం చేశారు. గిరిజన ప్రాంతాల్లో మార్కెట్‌ యార్డుల అభివృద్ధికి రూ.19 కోట్లు విడుదల చేస్తూ ఆమె రెండో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'గిరిజన సంక్షేమ శాఖ లో పారదర్శక పాలన అందించి, సీఎం వైఎస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా' అన్నారు. గిరిజనులకి ఇచ్చిన ప్రతి ప్రభుత్వ పథకాన్ని, హామీని నెరవేర్చి గిరిజనుల ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో విద్యావకాశాలు మెరుగుపరిచి, గిరిజన ఆడపిల్లలకి వైఎస్సార్ పెళ్లికానుక కింద లక్ష రూపాయలు అందిస్తామన్నారు. గతంలో చంద్రబాబు గిరిజనులని అంటరాని వారిగా చూసి మంత్రి పదవి ఇవ్వలేదని, గిరిజనులని ఉప ముఖ్యమంత్రి చేసిన జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు.

మరిన్ని వార్తలు