సీఎం జగన్‌ను ప్రశంసించిన యూకే డిప్యూటీ హై కమిషనర్‌

26 Jun, 2020 14:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలు ప్రపంచానికి ఆదర్శమంటూ యూకే డిప్యూటీ హై కమిషనర్‌ ఫ్లెమింగ్‌ ప్రశంసలు కురింపించారు. దీనికి సంబంధించి ఫ్లెమింగ్‌ ట్వీట్‌ను జోడిస్తూ వైఎస్సార్‌సీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) శుక్రవారం ట్వీట్‌ చేశారు. ఫ్లెమింగ్ శుక్రవారం తన ట్వీట్‌లో  ‘4.5 లక్షలమంది వాలంటీర్లు, 11వేల మందికి పైగా సెక్రటరీల సాయంతో ప్రతి 10 లక్షల మందిలో 14వేల మందికి టెస్టులు నిర్వహించారని, అలాగే టెక్నాలజీ సాయంతో క్వారంటైన్‌ను మానిటర్ చేస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు. ఇది ప్రపంచానికి ఒక పాఠం అంటూ పేర్కొన్నారు. (రైతులు రూపాయి కడితే చాలు: సీఎం జగన్‌)

ఈ ట్వీట్‌పై స్పందించిన వైఎస్సార్‌సీపీ నేత పీవీపీ ‘కరోనా కట్టడి విషయంలో ఏపీ మోడల్‌ను ప్రపంచానికి రికమెండ్‌ చేసినందుకు ధన్యవాదాలు. టెక్నాలజీ సాయంతో ప్రతి 50మందిని మ్యాపింగ్ చేస్తున్నాం. దానికి తగినంత మంది మాకు అండగా ఉన్నారు’ అని ఫ్లెమింగ్‌కు రిప్లై ఇచ్చారు. కరోనా కట్టడికి జగన్ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. టెస్టుల సంఖ్యను భారీగా పెంచి, దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తోంది. అలాగే పొరుగు రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వస్తున్నవారిపై దృష్టి సారించింది. అంతేకాకుండా ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి కరోనా వైరస్‌ పరీక్షలు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. (అందరి ఆరోగ్యంపై 90 రోజుల్లో స్క్రీనింగ్‌)

మరిన్ని వార్తలు