యూరియూ ఉన్నా.. కొరతే!

10 Sep, 2014 01:55 IST|Sakshi
యూరియూ ఉన్నా.. కొరతే!

అన్నదాతకు అన్నింటా కష్టాలు తప్పడం లేదు. నిన్న మొన్నటి వరకు తీవ్రమైన వర్షాభావంతో అల్లాడిన రైతాంగం ఇటీవల కురిసిన వర్షాలతో కొంత తేరుకున్నారు. అరుుతే విత్తనాల నుంచి ఎరువుల వరకు అన్నింటా కృత్రిమ కొరత సృష్టిస్తుండడంతో వారు వేదనకు గురవుతున్నారు. అన్నదాతకు అన్ని విధాల అండ దండగా ఉండాల్సిన అధికార యంత్రాంగం పాలకుల ఒత్తిళ్ల నేపథ్యంలో వారి కష్టాలను విస్మరిస్తున్నారు. విత్తన సమయంలో అవస్థలు ఎదుర్కొన్న రైతులు ఇప్పుడు కావాల్సిన ఎరువుల కోసం కష్టాలు పడుతున్నారు. కావాల్సినంత మొత్తంలో ఎరువులు ఉన్నా పాలకుల కనుసన్నల్లో పంపిణీ జరుగుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
 విజయనగరం వ్యవసాయం : అష్టకష్టాలు నడుమ సాగు చేపట్టిన రైతులు ఎరువుల కోసం అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అధికంగా వినియోగించే యూరియూ దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఎరువులను ప్రాథమిక పరపతి సహకార సంఘాల(పీఏసీఎస్) ద్వారా సరఫరా చేస్తున్నారు. అరుుతే సొసైటీ అధ్యక్షులు పంపిణీలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల సిఫారసులు ఉన్న వారికే ఎరువులను కేటారుుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. సిఫారసులు చేసిన వారికి 40 నుంచి 50 బస్తాల వరకు ఇచ్చేస్తున్నారని, సాధారణ రైతులకు ఒక్క బస్తా కూడా ఇవ్వడానికి అవస్థల పాల్జేస్తున్నారని వారు వాపోతున్నారు. జిల్లాలో 95 సొసైటీలకుగాను 83 సొసైటీలకు ఈ ఏడాది ఎరువులను కేటారుుంచా రు.  15 వేల టన్నుల యూరియూను సొసైటీలకు అందజేశారు. అరుుతే సొసైటీలకు వెళ్లే రైతులకు మాత్రం అధికారులు మొండి చేరుు చూపిస్తున్నారు. కొందరు సొసైటీ అధ్యక్షులు ఎరువులను ప్రైవేటు డీలర్లకు తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. డీఏపీ 50 కేజీల బస్తా రూ.1180 ఉండడంతో రైతులు ఎక్కువగా యూరియూ వాడకానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అరుుతే సొసైటీల్లో యూరియూ దొరక్కపోవడంతో ప్రైవేటు వ్యాపారుల వద్దకు వెళ్లాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు.
 అధిక ధరలకు విక్రయూలు...
 ఎరువులను ఎంఆర్‌పీ ధరలకే విక్రరుుంచాలని జిల్లా ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. అమలుకు నోచుకోవడం లేదు.  ప్రతీ బస్తాకు రైతుల నుంచి అదనంగా రూ.10 నుంచి 30 వరకు వసూలు చేస్తున్నారు. అరుుతే గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు కొనుగోలు చేస్తున్నారు. సొసైటీల్లో యూరియూ బస్తా రూ.283.84లకుగాను రూ.290, డీఏపీ రూ.280కుగాను రూ.290లకు విక్రరుుస్తున్నారు. వీటినే ప్రైవేటు డీలర్లు మరో పది నుంచి 30 రూపాయల వరకు అదనంగా కలిపి విక్రరుుస్తున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రైవేటు వ్యాపారుల ఇష్టారాజ్యం సాగుతోంది. ఇదే విషయం వ్యవసాయ శాఖ జేడీ ప్రమీల వద్ద సాక్షి ప్రస్తావించగా యూరియూ ఇబ్బందులు తన దృష్టికి రాలేదని చెప్పారు. రేపటి నుంచి వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా సొసైటీల్లో యూరియూను విక్రరుుస్తామని, అధిక ధరలకు విక్రరుుస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు