పట్టుదలతో ముందుకెళ్లాలి

2 Nov, 2014 04:01 IST|Sakshi
పట్టుదలతో ముందుకెళ్లాలి

చంద్రగిరి : పట్టుదలతో ముందుకెళితే లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చని ఎస్వీయూ వీసీ రాజేం ద్ర అన్నారు. చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సాయినాథ నగర్‌లోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో శనివారం ఫ్రెషర్స్‌డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.  ముఖ్య అతిథిగా వీసీ రాజేంద్ర పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా విద్యాసంస్థల అధినేత డాక్టర్ మోహన్‌బాబు హాజరయ్యారు. విద్యార్థుల నుద్దేశించి వీసీ మాట్లాడుతూ ఎంతపెద్ద ప్రయోజనమైనా తొలి అడుగుతోనే ప్రారంభమవుతుందన్నారు.

పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదీ కష్టం కాదన్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. విద్యాసంస్థల అధినేత మోహన్‌బాబు మాట్లాడుతూ గెలుపోటములు ప్రతిఒక్కరి జీవితంలో సహజమేనన్నారు. కిందపడిపోతే పైకి లేవడం తెలుస్తుందన్నారు. దొంగతనం, ఒకరిని మోసం చేసినప్పుడే తలదించుకుని బతకాలని, లేకుంటే తల ఎత్తుకుని దర్జాగా బతకవచ్చన్నారు.

అనంతరం కళాశాల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. విద్యాసంస్థల ట్రస్ట్ వెంకటాద్రి నాయుడు, స్పెషల్ ఆఫీసర్ ఆచార్యు లు గోపాలరావు, ఇంజినీరింగ్  ప్రిన్సిపాల్ కృష్ణమాచారి, భగవానులు, ఫైనాన్స్ అడ్వయిజరీ రవిరాజన్, సీవోవో సుదర్శనకుమార్, సీఎవో తులసీనాయుడు పాల్గొన్నారు.
 
అలరించిన మోహన మంత్రం

శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ప్రాంగణంలో మోహనమంత్ర సాంకేతిక  సాంస్కృతిక ఉత్స వం మూడవ రోజు శనివారం చూపరులను మంత్రముగ్దులను చేసింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ , తమిళనాడు, కేరళ, విదేశాల నుంచి సైతం దాదాపు  20 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. శనివారం ఆఖరు రోజు కావడంతో విద్యార్థులు   ఉత్సాహంతో పాల్గొన్నారు.

రంగోళి, దేశ భాషలందు తెలుగులెస్స, సినీ బజ్, చిత్ర కళాక్షేత్రం, డాన్సిం గ్ తదిర కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు తమ ఆటపాటలతో ఈ కార్యక్రమాన్ని ముగించారు. డెరైక్టర్ ఆచార్య భగవానులు మాట్లాడుతూ ఈకార్యక్రమానికి సహకరించిన విద్యార్థినీవిద్యార్థులు, అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.  స్పె షల్ ఆఫీసర్ గోపాలరావు, ఫైనాన్స్ అ డ్వయిజర్ రవిశేఖర్, సీవోవో సుదర్శన్, సీఎవోకె తులసినాయుడు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు