అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి

20 Dec, 2019 04:25 IST|Sakshi

ఒకే ప్రాంతంలో అభివృద్ధి సమంజసం కాదు

రాష్ట్రానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం చేకూర్చాలి

రైతుల ముసుగులో ఇష్టం వచి్చనట్లు మాట్లాడితే సహించం

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

సాక్షి, అమరావతి : అధికార వికేంద్రీకరణ అన్నది అభివృద్ధి చెందుతున్న సమాజంలో చాలా అవసరమని, ఒకే ప్రాంతంలో అభివృద్ధి జరగడం, సంపద పెరగడం సమంజసం కాదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం రావచ్చని, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనపై దేశవ్యాప్తంగా చాలాచోట్ల హర్షం వ్యక్తమవుతోందన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుందని ఆయన తెలిపారు. సీఎం చెప్పిన ప్రతిదాన్ని వ్యతిరేకించటం చంద్రబాబుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

రాజధాని అంటే నగరాల నిర్మాణం కాదు..
మూడు రాజధానులు అంటే మూడు నగరాలు నిర్మించడం కాదనే విషయాన్ని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు అర్థంచేసుకోవాలని అంబటి హితవు పలికారు. రాజధాని అంటే ఒక శాసనసభ, ఒక హైకోర్టు, ఒక సచివాలయం, వారు నివసించే ఇళ్లు.. ఇలా ముఖ్యమైన భవనాలు నిరి్మంచడమని స్పష్టంచేశారు. ఆర్దికంగా చితికిపోయిన రాష్ట్రానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో రాష్ట్రాన్ని పాలించమని చంద్రబాబుకు పట్టం కడితే, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా రాజధాని పేరుతో రియల్‌ వ్యాపారం చేశారని విమర్శించారు. కేంద్రీకృత అభివృద్ధితో మనం చాలా ఇబ్బంది పడ్డామని.. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ మూడు రాజధానులు అవసరమని అభిప్రాయపడ్డారన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలు ఎవరికి వారు అభివృద్ధి చెందాలని కోరుకుంటారన్నారు. అలాగే, రాజధాని మారిస్తే భూములిచి్చన రైతులు నష్టపోరని అంబటి అన్నారు. రైతుల ముసుగులో వ్యక్తిగత దూషణలకు దిగి సీఎంను అనరాని మాటలు అంటే సహించేదిలేదన్నారు.  

మరిన్ని వార్తలు