దేవినేని ఉమా సోదరుడు సంచలన వ్యాఖ్యలు

29 Feb, 2020 20:20 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వం హయాంలో చోటుచేసుకున్న అవినీతిపై టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడట్టు తేటతెల్లమవుతోందని అన్నారు. టీడీపీ నేతల అవినీతిపై విచారణ జరిపితే ప్రముఖుల బండారం బయటపడుతుందని పేర్కొన్నారు. శనివారం విజయవాడలో ఆయన  ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మాజీమంత్రి దేవినేని ఉమా అండదండలతో చాలామంది అక్రమాలకు పాల్పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘కృష్ణా జిల్లా కంచికచర్ల మాజీ మార్కెటింగ్ చైర్మన్ లక్ష్మీనారాయణ సామాన్య రైతు కుటుబానికి చెందిన వారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి సొమ్ము కూడగట్టారు. రాజధాని ప్రాంతంలో బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కి పాల్పడ్డారు. సీఐడీ సోదాల్లో దొరికింది చాలా తక్కువ. వారి అవినీతిపై మరింత లోతుల్లోకెళ్లి విచారణ జరిపితే చాలా అక్రమాలు బయటపడతాయి. లక్ష్మీనారాయణ కొడుకు సీతారామరాజు రియల్ ఎస్టేట్ కంపెనీలో సోదాలు చేస్తే మొత్తం వ్యవహారం బయటపడుతుంది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో లక్ష్మీనారాయణ వెనక ఉన్న ప్రముఖ నేతల బండారం కూడా బహిర్గతం అవుతుంది. మాజీమంత్రి దేవినేని ఉమా అండదండలతో కంచికచర్లలో చాలామంది అక్రమాలకు పాల్పడ్డారు. సహకార బ్యాంకు రుణాల గోల్‌మాల్‌లో కూడా దేవినేని ఉమా అండదండలు ఉన్నాయి’ అని అన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు