జుట్టు కేంద్రం చేతికివ్వొద్దు: దేవినేని

7 Jul, 2014 08:52 IST|Sakshi
జుట్టు కేంద్రం చేతికివ్వొద్దు: దేవినేని

హైదరాబాద్ : రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వనరుల సమస్యలను రాష్ట్రాస్థాయిలో పరిష్కరించుకుంటేనే మంచిదని, అలాగాక జటిలం చేసుకుని మన హక్కులను కేంద్రం చేతికిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

కృష్ణా బేసిన్లో 10 లక్షల ఎకరాలకు పైబడి వరి చేయాల్సి ఉండగా, కేవలం 150 హెకార్టలోనే నారుమళ్లు పడ్డాయంటే... అదికూడా బోర్ల కింద పడటాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. తాగునీటికి సైతం గడ్డుకాలం దాపురించిందని మంత్రి అన్నారు. వర్షాలు పడకపోతే ప్రత్యామ్నాయం ఏంటనే పరిస్థితి భయపెడుతోందన్నారు.

 

>
మరిన్ని వార్తలు