10 నుంచి దుర్గమ్మ దర్శనానికి అనుమతి

8 Jun, 2020 12:00 IST|Sakshi

గంటకు 250 మంది భక్తులు మాత్రమే అనుమతి

నేడు, రేపు సిబ్బందితో ట్రయల్‌ రన్‌

సాక్షి, విజయవాడ: ఈనెల 10 నుంచి దుర్గమ్మ దర్శనానికి భక్తులకు అనుమతి అనుమతిస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. నేడు, రేపు సిబ్బందితో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే దర్శనం చేసుకునేందుకు అనుమతిస్తామని ఈఓ ఎంవీ సురేష్‌బాబు తెలిపారు. గంటకు 250 మంది చొప్పున రోజుకు 5వేల మందికి మాత్రమే దర్శనం చేసుకునేందుకు అనుమతి ఉంటుందన్నారు. భక్తులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించి,శానిటైజ్‌ చేసి చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. థర్మల్‌  స్క్రీనింగ్‌ లో భక్తులకు టెంపరేచర్ ఎక్కువుగా ఉంటే ఆలయంలోకి అనుమతిలేదని ఆయన స్పష్టం చేశారు. (దుర్గమ్మ దర్శనానికి వేళాయె)

కొన్ని రోజులు శఠగోపురం, తీర్థ ప్రసాదంతో పాటు ఆశీర్వచనాలు రద్దు చేశామని వెల్లడించారు. అంతరాలయ దర్శనం నిలిపివేశామని, ముఖ మండపం ద్వారానే అమ్మవారిని దర్శించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఆన్ లైన్ స్లాట్ బుక్ చేసుకున్న వారికే అమ్మవారి దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు. మహా మండపం వద్ద మరో ఆన్ లైన్ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలకు భక్తులను అనుమతి లేదన్నారు. ఘాట్ రోడ్డు మార్గం ద్వారా భక్తులను అనుమతిలేదని చెప్పారు. వృద్ధులు, చిన్నపిల్లలకు ఆలయంలోకి అనుమతి లేదని తెలిపారు. మహా మండపం ద్వారా దిగువకు పంపించేందుకు సిబ్భందితో ట్రయల్‌ నిర్వహిస్తునట్లు ఆలయ అధికారులు తెలిపారు. (నేటి నుంచి తిరుమల శ్రీవారి దర్శనం షురూ)

మరిన్ని వార్తలు