ఇంద్రకీలాద్రిపై భక్తుల ఆందోళన

24 Sep, 2017 12:56 IST|Sakshi

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీగా తరలివచ్చిన భక్తులకు ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. ఎంతకూ అమ్మవారి దర్శనం లభించకపోవడంతో భక్తులు ఆందోళనకు దిగారు. ఆలయ అధికారులు వీఐపీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, దుర్గమ్మ దర్శనానికి తమను అనుమతించడం లేదని భక్తులు మండిపడుతున్నారు. రూ. 3వేలు పెట్టి టికెట్‌ కొనుకున్నా.. దర్శనం కోసం బారులు తీరడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కుంకుమపూజ కోసం భక్తులు మండుటెండలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా అందుబాటులోకి లేకపోవడంతో ఆలయ ఈవోను నిలదీశారు. దీంతో భక్తులకు సమాధానం చెప్పకుండానే ఈవో సూర్యకుమారి వెళ్లిపోయారు.

శరన్నవరాత్రి వేడుకలు ఇంద్రకిలాద్రిపై వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మవారు  ఆదివారం అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దుర్గమ్మ దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
 

మరిన్ని వార్తలు