తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

5 May, 2017 08:46 IST|Sakshi
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: నేడు రెండోరోజు తిరుమలలో పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు జరుగుతున్నాయి. 6వ తేదీ వరకు పలు ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. కాగా శుక్రవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి ప్రస్తుతం 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు.

శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. నిన్న(గురువారం) స్వామివారిని 71,691 మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీకి రూ. 1.95 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు