ఆ ఘటన హృదయాన్ని కలచివేసింది : డీజీపీ

18 May, 2020 19:10 IST|Sakshi

ఆత్మకూరు ఘటనపై స్పందించిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

సాక్షి, నెల్లూరు : జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ కాలేజీలో ఓ చిన్నారితో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ గదిని శుభ్రం చేయించిన ఘటనపై  ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పందించారు. కాలేజీ గదిని శుభ్రం చేస్తున్న చిన్నారి దృశ్యాలు తన హృదయాన్ని కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ తండ్రి తన పనిని కూతురి చేత చేయించడం కూడా చట్టరిత్యా నేరమే అవుతుందన్నారు. ఈ ఘటనను అడ్డుకోవాల్సిన కానిస్టేబుల్స్‌ ప్రేక్షక పాత్ర వహించడంపై అసహనం వ్యక్తం చేశారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు ఎస్పీని ఆదేశించారు. కళాశాల యాజమాన్యంపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా