వారి బాధ్యత మహిళా సంరక్షణ కార్యదర్శులదే: డీజీపీ

2 Dec, 2019 14:52 IST|Sakshi

సాక్షి, విజయవాడ : గ్రామ సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులు గ్రామంలోని మహిళల భద్రత పట్ల బాధ్యతగా వ్యవహరించాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సూచించారు. గురువారం డీజీపీ మాట్లాడుతూ.. మహిళలు, బాలికల సమస్యలు తీర్చే బాధ్యత మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో మహిళలకు, బాలికలకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉన్నాయని, వీటిని అధిగమించడానికి మహిళా సంరక్షణ కార్యదర్శులు తోడ్పాటుగా ఉండాలని సూచించారు. మహిళా సంరక్షణ కార్యదర్శుల వల్ల సమాజంలో సమాజంలో పెను మార్పులు తీసుకురావలని పిలుపునిచ్చారు. మొత్తం రాష్ట్రంలో 14967 మంది కార్యదర్శులు ఉన్నారని వీరికి ఆరు నెలల్లో 10 బ్యాచ్‌లుగా 11 సెంటర్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణలో పోలీసులతోపాటు మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు కూడా పాల్గొంటారని తెలిపారు. రెండు వారాల్లో ప్రాక్టికల్‌ క్లాసులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మహిళా కార్యదర్శులకు ఆత్మ రక్షణ, యోగా వంటి క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు