పటేల్‌ కృషి మరువలేనిది: డీజీపీ సవాంగ్‌

31 Oct, 2019 08:38 IST|Sakshi

సాక్షి, విజయవాడ: జాతీయ సమైఖ్యతా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో గురువారం ‘రన్‌ ఫర్‌ యూనిట్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ​కార్యక్రమానికి ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, కలెక్టర్‌ ఇంతియాజ్‌,  సీసీ ద్వారక తిరుమలరావుతో పాటు లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీజీ రవిశంకర్‌ హజరయ్యారు.

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఈ సందర్బంగా పోలీసుల చేత దేశ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉంటామంటూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ఏకం చేయండంలో సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కృషి మరువలేనిదని అన్నారు. పోలీసులు కుడా వివిధ విభాగాల్లో కలిసి పనిచేయడం వల్ల మంచి పురోగతి సాధిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేస్తే ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. కాగా విద్యార్ధి దశ నుంచే ఐక్యతా భావం పెంపోందించాలని ఆయన సూచించారు. అనంతరం బెంజిసర్కిల్‌ నుంచి సీఏఆర్‌ గ్రౌండ్‌ వరకు సాగనున్న సమైక్యత పరుగుకు డీజీపీ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ సమైక్యత పరుగులో పోలీసులతో  పాటు అధిక  సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

ఇక సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్‌ బాబు ‘ఏక్తా దినోత్సవం’ లో భాగంగా ‘రన్‌ ఫర్‌ యూనిట్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి కోనేరు సెంటరు వరకు ఈ ఐక్యత పరుగును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు