ఏపీలో ఆరు శాతం నేరాలు తగ్గుముఖం

29 Dec, 2019 12:02 IST|Sakshi

ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

సాక్షి, విజయవాడ: ఏపీలో ఆరు శాతం నేరాల సంఖ్య తగ్గిందని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2019లో ఏపీ పోలీసుల పనితీరును వివరించారు. ఏపీలో మహిళాభద్రతకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. కేవలం రెండు జిల్లాలకే (విశాఖ,తూర్పు) మావోయిస్ట్‌ కార్యకలాపాలు పరిమితమయ్యాయని తెలిపారు. గుట్కా, ఇసుక, బెల్టుషాపులు, గంజాయిపై ఉక్కుపాదం మోపామని చెప్పారు. సామాన్యులపై ప్రభావం చూపుతున్న జూదం, పేకాట క్లబ్‌లను మూసివేశామని పేర్కొన్నారు. సమర్థవంతంగా దిశ బిల్లు అమలు చేస్తున్నామని తెలిపారు.

ఏపీలో అన్ని పోలీస్‌స్టేషన్లలో జీరో శాతం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నామని చెప్పారు.  జాతీయస్థాయిలో ఏపీ పోలీసులకు గుర్తింపు వచ్చిందన్నారు. స్కోచ్‌, డీఎస్‌సీఐ జీ ఫైల్స్‌కు సంబంధించి ప్రధాని మోదీ ప్రశంసించారని తెలిపారు. పోలీసులకు వీక్లీ ఆఫ్‌లను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో పోలీసు వాలంటీర్ల నియామకం చేపట్టినట్లు వెల్లడించారు. దేశంలో మొదటిసారి కొత్త సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తున్నామని పేర్కొన్నారు. సమర్థవంతంగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని డీజీపీ తెలిపారు.


 

మరిన్ని వార్తలు