ఓవర్‌ నైట్‌లోనే మార్పు సాధ్యం కాదు: డీజీపీ

31 Jul, 2019 13:22 IST|Sakshi

సాక్షి, కృష్ణా : రాత్రి వేళల్లో మహిళలు టీ తాగడానికి బయటకు ఎందుకు వెళ్లకూడదని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రశ్నించారు. రాత్రిళ్లు కూడా స్త్రీలు ధైర్యంగా బయటకు వచ్చే పరిస్థితులు రావాలని...వారి పట్ల లింగ వివక్షత ఉండకూడదని అన్నారు. విజయవాడలో బుధవారం జరిగిన.. బహింరంగ ప్రదేశాల్లో మహిళల రక్షణపై శిక్షణ(క్లాప్‌) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సవాంగ్‌ మాట్లాడుతూ ఏపీ డీజీపీ, పోలీసులతో పాటు ప్రజలు కలిస్తే ఆ ప్రభావం సమాజంలో వేరుగా ఉంటుందన్నారు. మహిళ మిత్ర ద్వారా సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. గతంలో మహిళలు పోలీసులు, పోలీస్‌ స్టేషన్‌లు అంటే ఏవేవో అనుమానాలతో స్టేషన్‌కు వెళ్లలేక పోయేవారని, ఇప్పడు అలాంటి భయాలు మహిళల్లో లేవని సమాజంలో కొంత మార్పు వచ్చిందన్నారు. రాత్రికి రాత్రే మార్పు అనేది సాధ్యం కాదు.. సిస్టమేటిక్‌గా మార్పును తీసుకురావాలని ఆయన తెలిపారు. సమాజం మారాలనుకుంటే సరిపోదు.. దానికి తగిన చర్యలు తీసుకుంటూ శాశ్వతమైన ఆలోచన కలిగి ఉండాలన్నారు. అలాగే  ప్రతి సోమవారం నాడు జరిగే స్పందన ప్రోగ్రామ్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రివ్యూ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.


 

మరిన్ని వార్తలు