అభిమానానికి ‘సాక్షి’

31 May, 2019 10:07 IST|Sakshi

గుర్రంకొండ: ఆయన యాచకుడు. సాక్షి దినపత్రిక చదవందే తృప్తి ఉండదు. భిక్షాటన చేసిన చిల్లరతోనే పేపర్‌ కొంటాడు. పత్రిక ఆసాంతం చదవిన తరువాతే తన దినచర్య ప్రారంభిస్తాడు. వైఎస్‌ఆర్, జగన్‌పై అభిమానమే పత్రికపై మమకారం పెంచిందని తెలిపాడు. మండలంలోని చెర్లోపల్లెకు చెందిన ధర్మయ్య (80) యాచనతోనే జీవిస్తుంటాడు. రెడ్డెమ్మ దేవస్థానం లేదా ఖాళీ జాగాల్లో ఎక్కడ చల్లగా ఉంటే అక్కడ సేదదీరుతుంటాడు. రెడ్డెమ్మ కొండకు వచ్చే భక్తులు, స్థానికులు ఇచ్చే కాసులతో కడుపు నింపుకుంటాడు.

యాచనతో జీవిస్తున్న అతడు తన చిన్న కోరికలను అణిచేసుకోవడం లేదు. ఉదయం లేవగానే సాక్షి దినపత్రిక చదవడం అలవాటు. వైఎస్సార్, జగన్‌ అంటే వీరాభిమానం ఉన్న అతడు దాతలు ఇచ్చే చిల్లరతోనే సాక్షి దినపద్రిక కొంటాడు. గ్రామంలోని ఏదో ఇంటిమెట్లపై కూర్చుని నింపాదిగా పత్రికలోని అన్ని విషయాలు చదువుతాడు. ఆ తర్వాతే తన దినచర్యలో భాగమైన భిక్షాటనకు బయల్దేరతాడు. ఇంతకు ముందు పత్రికను అక్కడా, ఇక్కడా చదివేవాడినని.. అయితే మూడేళ్లుగా సాక్షి పత్రికను కొని చదవడం అలవాటు చేసుకున్నట్లు తెలిపాడు. సాక్షి చదవకుంటే వెలితిగా ఉంటుందని, వార్తలు చదివిన తర్వాతే తన పని ప్రారంభిస్తానని చెప్పాడు. 

మరిన్ని వార్తలు