23 తర్వాత వైఎస్సార్‌సీపీలోకి: ధర్మాన

7 Jan, 2014 01:08 IST|Sakshi
23 తర్వాత వైఎస్సార్‌సీపీలోకి: ధర్మాన


 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మాజీ మంత్రి, శ్రీకాకుళం కాంగ్రెస్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. ఈనెల 23 తరువాత చేరేందుకు వీలుగా ఆయన అనుచరులు భారీగా సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డినికలిసి తాను పార్టీలో చేరాలనుకుంటున్న విషయాన్ని వివరించారు. త్వరలో శ్రీకాకుళంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి, లక్షలాది మంది సమక్షంలోనే ఆ పార్టీలో చేరుతానన్నారు.

మరిన్ని వార్తలు