చంద్రబాబుకు ఆగతే పడుతుంది

12 Dec, 2018 08:18 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ధర్మాన ప్రసాదరావు

నిజాయితీకి, అభివృద్ధికి ప్రజలు పట్టడం కడతారు

వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలాడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ కోట్ల రూపాయలు అవినీతి చేసి దొంగగా దొరికిపోతాననే భయంతో జాతీయ పార్టీల నాయకులతో జతకట్టి తనకు తాను రక్షించుకోవడానికి ఎత్తులు వేస్తున్నాడని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు అన్నారు.  శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధికి, నిజాయితీ పాలనకు ప్రజలు పట్టం కడతారనడానికి ప్రతక్ష్య నిదర్శనం తెలంగాణలో టీఆర్‌ఎస్‌ గెలుపేనన్నారు. టీఆర్‌ఎస్‌ గెలుపు ప్రజా చైతన్యానికి నిదర్శనమన్నారు. మోసకారి చంద్రబాబుకి ఏపీలోను రానున్న ఎన్నికల్లో తెలంగాణలో పట్టిన గతే పడుతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో లక్షలాదిమంది తెలుగు ప్రజలున్నారని వారందరిఖఈ చంద్రబాబు గురించి తెలుసన్నారు. అందుకే చిత్తుగా మహాకూటమిని ఓడించారన్నారు.

రాష్ట్రంలో బాబు చేస్తున్న అరాచకాలను వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత నాలుగేళ్లుగా ప్రజలందరికీ విస్తృతంగా తెలియజేశారన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి రాజధాని పేరుతో భూముల సేకరణ, ఇసుక, నీరు–చెట్టు పనుల్లో కోట్ల రూపాయల దోపిడీ చేశారని ఆరోపించారు. దేశమంతా తిరుగుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనమైపోతుంది.. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అందరికీ అబద్ధాలు చెబుతూ ఉసుగొలుపుతున్నారన్నారు. ఏపీలో ఉద్యోగులు సీపీఎస్‌ రద్దు చేయమని కోరుతుంటే ఇక్కడ వదిలేసి తెలంగాణలో సీపీఎస్‌ రద్దు చేస్తానని హామీనివ్వడం, ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు 23 మందిని వదిలేసి తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను తక్షణమే రా>జీనామా చేయించాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్‌ చేసిన అప్పులతో ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, తాగునీటికి, విద్యుత్‌ వంటి సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తే.. చంద్రబాబు మాత్రం రాష్ట్రానికి రూ. 2 లక్షల కోట్లుకి పైగా అప్పులు చేసి దుబారా ఖర్చులు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రజా కంఠకుడని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడం వల్లే తెలంగాణ ప్రజలు బుబుకి తగిన బుద్ధి చెప్పారు. సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణందాస్, పలాస నియోజకవర్గ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు, నాయకులు గొండు కృష్ణమూర్తి, అంబటి శ్రీనివాస్, మూకళ్ల తాతబాబు, గొండు రఘురాం, అంధవరపు సూరిబాబు, సాధు వైకుంఠరావు, మెంటాడ స్వరూప్, పొన్నాడ రుషి, మండవల్లి రవి, కోరాడ రమేష్, పడ్డాన జీవరత్నం, శ్రీనివాస పట్నాయక్, చల్లా రవి, జె.ఎం.శ్రీనివాస్, పీస శ్రీహరి, పాలిశెట్టి మధుబాబు, తంగుడు నాగేశ్వరరావు, సిజు, బరాటం రామశేషు, గుడ్ల మల్లేశ్వరరావు, యజ్జల గురుమూర్తి, ఆర్‌ఆర్‌ మూర్తి, నక్క రామరాజు పాల్గొన్నారు.

నేటి పాదయాత్ర సాగేదిలా..
 ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో క్రిష్ణాపురం నుంచి బుధవారం ఉదయం పాదయాత్ర సాగనుంది. ఉదయం 7.30 గంటలకు పురుషోత్తపురం క్రాస్, మెట్టక్కివలస క్రాస్, ఊసవానిపేట, రెడ్డిపేట క్రాస్, కొత్తవానిపేట వరకు పాదయాత్ర సాగనుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనలో తెలియజేశారు. కొత్తవానిపేటలో మధఆ్యహ్న భోజన విరామం అనంతరం భైరవానిపేట, నక్కపేట క్రాస్‌ వరకు యాత్ర కొనసాగించి, అనంతరం రాత్రి బస చేయనున్నారని రఘురాం తెలియజేశారు.  

మరిన్ని వార్తలు