సాంకేతిక సామర్థ్యంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ దిట్ట

10 Nov, 2019 04:53 IST|Sakshi
అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

విశాఖపట్నం: సాంకేతిక సామర్థ్యంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ దిట్టని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా ఆయన శనివారం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ ఇనుప ఖనిజం కొరతను ఎదుర్కొంటున్నందున ఓఎండీసీ నుంచి తక్కువ ధరలకు సరఫరా చేయడానికి కృషి చేస్తామన్నారు. దీనివల్ల స్టీల్‌ప్లాంట్‌కు లాభం కలుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ఖనిజ సంపన్న రాష్ట్రాలని చెప్పారు.

జాయింట్‌ వెంచర్స్‌ కోసం, పోటీని ఎదుర్కోవడానికి, సంపద సృష్టికి స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం ముందుకు వెళ్లాలని సూచించారు. ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలతో ఎక్కువ ఉపాధి అవకాశాలు, ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం లభిస్తాయన్నారు. అంతకుముందు ఆయన స్టీల్‌ప్లాంట్‌లోని మోడల్‌ రూమ్, అవార్డు గ్యాలరీలను సందర్శించారు. వివిధ విభాగాలను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి, విశాఖపట్నం ఎంపీలు డాక్టర్‌ బి.సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ పీకే రథ్, డైరెక్టర్లు కేసీ దాస్, వీవీ వేణుగోపాలరావు, కేకే ఘోష్, ఏకే సక్సేనా, తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లైంగికదాడి.. హత్య!

పసిబిడ్డపై తండ్రి పైశాచికత్వం

పోలవరం సవరణ అంచనాలపై కేంద్రానికి నివేదిక

సిమ్‌ కార్డుల్లోనూ ‘రివర్స్‌’ ఆదా

తీరం దాటిన బుల్‌బుల్‌

రైతు భరోసా సమస్యలపై అనూహ్య ‘స్పందన’

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు

రివర్స్‌ టెండరింగ్‌లో మరో రూ.33.76 కోట్లు ఆదా..

‘అప్పుడే గొప్పదనం తెలుస్తుంది’

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

‘మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా నిర్వహిస్తాం’

ఈనాటి ముఖ్యాంశాలు

‘నేతన్నల నిజమైన నేస్తం జగనన్న’

భూవివాదం: గిరిజన రైతు మృతి

బురద చల్లడమే చంద్రబాబు లక్ష్యం

‘దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు చర్యలు’

పేర్లు సరిగా పలకడమే రాని మాలోకం..

అక్రమాలకు పాల్పడితే సహించం: మంత్రి వనిత

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించిన కేంద్రమంత్రి

లోకేష్‌.. 'కార్పొరేటర్‌కు ఎక్కువ ఎమ్మెల్సీకి తక్కువ'

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా

రైతును కాపాడిన అగ్నిమాపక సిబ్బంది

నగరానికి జ్వరమొచ్చింది

అయోధ్య తీర్పు: సీఎం జగన్‌ విఙ్ఞప్తి

కలాం నా దగ్గరే విజన్‌ నేర్చుకున్నారు..

ఆమె పేరు చెబితే కార్యదర్శులకు హడల్‌ 

అగ్రిగోల్డ్‌ విలన్‌ చంద్రబాబే 

నాడు–నేడుకు ప్రకాశంలో శ్రీకారం

పౌడర్‌ డబ్బాపై పడి చిన్నారి మృతి 

టీడీపీ నేతకు సబ్‌ జైలులో రాచ మర్యాదలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మన తప్పుకు మనదే బాధ్యత

కనిపిస్తుంటుంది.. కానీ క్యాచ్‌ చేయలేం

కొత్త అడుగులు?

రొమాంటిక్‌ రూలర్‌

అన్ని ప్రాంతీయ భాషల్లో సినిమాలు చేయాలనుంది

మంత్రిని కలిసిన రాహుల్‌ సిప్లిగంజ్‌