ప్రతి గురువారం డయల్‌ యువర్‌ సీఈవో

8 Oct, 2019 17:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరును తెలుసుకునేందుకు డయల్‌ యువర్‌ సీఈవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్‌ ఎ.మల్లిఖార్జున సోమవారం తెలిపారు. ప్రతి గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు డయల్‌ యువర్‌ సీఈవో కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా చేపట్టిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలకు సక్రమంగా అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. నిర్ణీత సమయంలో 0863–234166కు ఫోన్‌ చేసి సమస్యలు చెప్పవచ్చని మల్లిఖార్జున పేర్కొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా