పగలు భగభగ.. రాత్రి గజగజ

9 Mar, 2018 11:41 IST|Sakshi
ఉదయం 8 గంటలకు పొగమంచు తగ్గకపోవడంతో లైట్లు వేసుకుని ప్రయాణం చేస్తున్న దృశ్యం

ఉదయం తీవ్ర ఎండ, రాత్రి చలి

వెంకటగిరి రూరల్‌: మార్చి ప్రారంభమైన కొద్దిరోజుల నుంచి పగలు ఎండ తీవ్రత, రాత్రి చలితో ప్రజలు వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒక వైపు ఉదయం 11 గంటల నుంచే ఎండ ప్రభావం తీవ్రమవుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. మరో వైపు రాత్రి 10 నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు వరకు మంచు కురుస్తోంది. దీంతో వాహనచోదకులు మంచులో దారి సరిగా కనపడక ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ ఉదయం 11 గంటలు దాటితే చాలు ఎండ తీవ్రతకు రహదారులు, రద్దీ ప్రాంతాలు అంతా నిర్మానుష్యంగా మారుతున్నాయి. వేసవి ఆరంభంలోనే ఎండలు ఇలా ఉంటే రానున్న ఏప్రిల్, మే నెలల్లో ఏ స్థాయిలో ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  

వాతావరణంలో మార్పుతో ఇక్కట్లు
నాయుడుపేట టౌన్‌:  ఉదయం పూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి, రాత్రి పూట చలి తీవ్రంగా ఉండటంతో ప్రజలు వాతవారణ మార్పునకు సతమతమవుతున్నారు. మార్చి ప్రారంభమైన  కొద్ది రోజులుగా ఉదయం 9 గంటల నుంచే 35 డిగ్రీల సెంటిగ్రేడ్‌ కంటే అధికంగా ఎండలు కాస్తుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఎప్పుడూ జనాలతో కిటకిటలాడే బజారువీ«ధి, గడియారం సెంటర్, దర్గావీధి, పాతబస్టాండు తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటలకే రహదారులు బోసిపోతున్నాయి. 

మరిన్ని వార్తలు