‘బాధ్యతా రహితంగా జనసేన ఎమ్మెల్యే తీరు’

13 Aug, 2019 12:01 IST|Sakshi

జనసేన దాడిలో ధ్వంసమైన పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించిన డీఐజీ

సాక్షి, రాజోలు : జనసేన కార్యకర్తల దాడిలో ధ్వంసమైన తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఏలూరు రేంజ్‌ డీఐజీ ఏఎస్‌ ఖాన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే బాధ్యతా రహితంగా వ్యవహరించడం సమాజానికి మంచిది కాదన్నారు. ఇలాంటి తొందరపాటు చర్యలు సమాజంలో యువతకు పోలీస్‌ వ్యవస్థను ఏమైనా చేయొచ్చనే తప్పుడు సంకేతాలు వెళ్ళతాయని తెలిపారు.

సోషల్‌ మీడియాలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ మాట్లాడిన వీడియో ఆధారంగా, పీఎస్‌ ముట్టడిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఒక మండల స్థాయి అధికారి అయిన ఎస్‌ఐను బాధ్యత గల ప్రజాప్రతినిధి దూషిస్తూ.. దాడికి పాల్పడటం సమంజసం కాదన్నారు. ఎస్‌ఐ తప్పు చేసి ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే.. చర్యలు తీసుకునే వాళ్లమని తెలిపారు. (చదవండి: పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన ఎమ్మెల్యే)

మరిన్ని వార్తలు